calender_icon.png 19 April, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల మొదటి విడతలో ప్రతిభ కనబర్చి సీటు సాధించిన బన్న మృదుల్

17-04-2025 08:07:52 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తెలంగాణ గురుకుల సెట్ 2025 పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన కాసిపేట మండల కేంద్రానికి చెందిన బన్న మృదుల్ 5వ తరగతిలో మొదటి విడత ఫలితాలలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, బెల్లంపల్లిలో సీటు సాధించారు. మృదుల్ కాసిపేట గ్రామానికి చెందిన బన్న సంపత్ కుమార్-సంధ్య ల రెండవ కుమారుడు. బన్న మృదుల్ కాసిపేట మండల కేంద్రంలోని విస్ డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అక్షరాభ్యాసం చేసి రెండవ తరగతి వరకు, 3,4 వ తరగతులు అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో చదివి టిజిసెట్ 2025లో సీటు సాధించడంతో బన్న మృదుల్ ను గురువారం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు అభినందించారు.