calender_icon.png 29 December, 2024 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌డీలపై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు

29-12-2024 12:19:44 AM

డిపాజిట్ల సేకరణలో వివిధ బ్యాంక్‌ల మధ్య నెలకొన్న పోటీ కారణంగా కొద్ది వారాల నుంచి కొన్ని బ్యాంక్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అధిక వడ్డీ రేటు లభించే బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) చేయాలని సాధారణంగా మదుపు దారులు ఆశిస్తుంటారు. .పలు పెద్ద బ్యాంక్‌లు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను సవరించాయి.

సాధారణంగా బ్యాంక్‌తో కస్టమర్లకు దీర్ఘకాలిక అనుబంధం ఉంటుంది. ఇదే సమయంలో కాస్త ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్‌ను సైతం ఎంచుకోవడం సహజం. అందుచేత ఖాతాదారులు తన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే బ్యాంక్‌లో కాకుండా మరో బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేయాలని చూస్తుంటారు. అలా అన్వేషించేవారి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న వివరాలు..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల్లో అధిక వడ్డీ 

రిస్క్ తీసుకోదలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాం క్‌ల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే పెద్ద బ్యాంక్‌లకంటే ప లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల్లో ఎఫ్‌డీ రేట్లు అ ధికం. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 9 శాతం వర కూ, సీనియర్ సిటిజన్లకు 9.5 శాతంవరకూ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 

కానీ వాటిలో చేసే డిపాజిట్ రూ.5 లక్షలకు మించకుండా చూసుకోవాలని, ఆ ఎఫ్‌డీలకే డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ లభిస్తుందని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు వివరించారు. 

ఒక ఏడాది ఎఫ్‌డీ

ఒక ఏడాది కాలపరిమితిగల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పలు ప్రైవేటు బ్యాంక్‌లు ఎక్కువ వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. రూ.3 కోట్లలోపు ఎఫ్‌డీపై 60 ఏండ్లలోపు వయస్సు ఉన్న సాధారణ పౌరులకు బంధన్ బ్యాంక్ అత్యధికంగా 8.05 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది.

ఇదే ఎఫ్‌డీపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ 7.75 శాతం వడ్డీ రేటును ఇస్తుండగా, ఆర్‌బీఎల్ బ్యాంక్ వడ్డీ రేటు 7.5 శాతంగా ఉన్నది. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై కర్నాటక బ్యాంక్ వడ్డీ రేటు 7.25 శాతంకాగా, యస్ బ్యాంక్ రేటు కూడా 7.25 శాతమే. డీసీబీ బ్యాంక్ 7.1 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.1 శాతం చొప్పున ఇస్తున్నాయి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఈ బ్యాంక్ ఒక ఏడాది కాలపరిమితిగల డిపాజిట్‌పై 6.8 శాతం వడ్డీని ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లను 7.30 శాతం ఆఫర్ చేస్తున్నది.

 బ్యాంక్ ఆఫ్ బరోడా 

బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం చొప్పున ఏడాది ఎఫ్‌డీపై వడ్డీ ఇస్తున్నది. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక సంవత్సరం కాలపరిమితిగల డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం చొప్పున వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది. 

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ ఒక సంవత్సరం కాలపరిమితిగల డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శా తం చొప్పున వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది. 

ప్రైవేటు బ్యాంక్‌లు

కోటక్ మహీంద్రా బ్యాంక్

 కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు  7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం చొప్పున ఉన్నాయి.  

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

ప్రైవేటు రంగంలోని అతిపెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు 6.60 శాతం, సీనియర్లకు 7.10 శాతం వడ్డీని ఇస్తున్నది. 

ఐసీఐసీఐ బ్యాంక్ 

ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఏడాది  15 నెలల కాలపరిమితిగల  ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై జనరల్ సిటిజన్లకు 6.7 శాతం వడ్డీ రేటును, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం చొప్పున వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది.

ఫెడరల్ బ్యాంక్

ఫెడరల్ బ్యాంక్ ఒక ఏడాది కాలపరిమితిగల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం చొప్పున వడ్డీ రేటు ఇస్తున్నది.