- వినియోగదారుడికి కనీస సౌకర్యాలు కరువు
- తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాహనాలకు గాలి, మరుగుదొడ్ల నిర్వహణ అంతంతే
- చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
మహబూబ్ నగర్ జనవరి 8 (విజయ క్రాంతి) : రోజురోజుకు వాహనం లేని వ్యక్తి కనిపించడేమో.... ఇంట్లో ఒక్కటి కాదు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి రెండు, మూడు, వాహ నాలు ఉన్న వాహన చోదకులు ఎంతో మం ది ఉన్నారు. రోజు పెట్రోల్, డీజిల్ తో కూడి న వాహనాలు బంకుల వైపు చూడక తప్ప దు. ప్రతి వాహనము పెట్రోల్ బంకు దరి చేరి అవసరమైన పెట్రోల్ డీజిల్ పోయించు కోవాల్సిన పరిస్థితి ఎలాగో ఉంటుంది.
కాగా పెట్రోల్ బంకుల వారు ఆదాయం పైన ఉన్న మక్కువ వాహన చోదకులకు దరి చేర్చవ లసిన సదుపాయాలను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుండ్రు. కేవలం తాత్కాలికంగా కొన్ని సదుపాయాలను కల్పించి వాటిని అమలు చేయకుండా, వచ్చిన వాహనాలకు అవసరమైన పెట్రోల్, డీజిల్ తో పాటు ఈ మధ్యకాలంలో ఊపందుకున్న సిఎన్జి, అవస రం మేరకు వాహనాల్లో నింపి పంపించడం పెట్రోల్ బంకుల నిత్యకృత్యం.
వాహన చోద కుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చు కుం టున్న పెట్రోల్ బంకుల యజమానులు మా త్రం వాహనచోదకులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో వెనుకంజ వేస్తున్నారు.
యజమానులు చుట్టాలా...
నిబంధనలు ఎన్ని ఉన్నా అవి మాకు చుట్టాలు అనే మాదిరిగా కొందరు పెట్రోల్ బంకుల యజమానులు వ్యవహరించడంతో వాహన చోదకులకు అందవలసిన సదుపా యాలు అందకుండా దూరంగా ఉంటున్నా యి. నిబంధనలు కేవలం పెట్రోల్ బంకులకే నా... వాటిని నడిపిస్తున్న యజమానులకు చుట్టాలేనా.. అనే విధంగా నిబంధనలను అమలు అవుతున్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతుంది.
ఎవరికివారు బిజీ వాతావరణం లో ఉంటూ మనకెందుకులే అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ కల్పించుకోవాల్సిన సదుపాయాలను కూడా ప్రశ్నించడంలో జనం పూర్తిగా మానేసినట్టు న్నారు. తనిఖీలు చేపట్టి అవసరమైన సదు పాయాలు కల్పించవలసిన అధికారులు అటువైపు చూడడమే మానేసిన్రు. ఇలా కొందరి పెట్రోల్ బంకులో యజమానులు ఇలాంటి సదుపాయాలు కల్పించకుండానే వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విరేజిల్లుతుంది.
పెట్రోల్ బంకు ల ఏర్పాటు విషయంలో పలు నిబంధనల ను అమలు చేస్తూ అధికారులు అనుమ తులు ఇస్తున్న వాటిని అమలు పరచడంలో మాత్రం బంకుల యజమానులు ఆసక్తి చూ పడం లేదు.
ప్రధాన రహదారుల్లో ఎక్కడ ఎలాంటి సదుపాయాలు కనిపించకపోయి నా పెట్రోల్ బంకుల లో నిబంధనల మేరకు సదుపాయాలు ఉంటే ఆపదలో ఉన్నవారికి ఈ సదుపాయాలు ఎంతో ఉపయోగపడు తున్నాయి. సదుపాయాలు కల్పించడంలో అధికారుల ప్రయత్నం ఉంటేనే వినియోగ దారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటుడ్రు.
ఎందుకు ఇంత నిర్లక్ష్యం..
ప్రతి పెట్రోల్ బంకులో వాహన చోదు లకు ఉచితంగా వాహనాలకు గాలి నింపాలి, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచి అవస రమైన నీటి సౌకర్యాన్ని కల్పించాలి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచి ఎవరి కైనా అత్యవసర పరిస్థితుల్లో కింద పడిన వారికి ప్రథమ చికిత్స నిమిత్తం అందుబా టులో ఉంచిన ఆ సమయంలో ఎంతో ఉప యోగకరంగా ఉంటుంది.
తాగునీరు సైతం వాహనచోదుల దరిచేరేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని నిబంధనలు చెబుతు న్నాయి. కాగా వాటిని అమలు చేయించ డంలో అధికారులు, చేయడంలో బంకుల యజమాన్యం నిర్లక్ష్యం దర్శనమిస్తుంది. ప్రతి బంకులోను దాదాపుగా గాలి నింపేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక మిషనరీ ఉన్న పనిచే యకపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది.
పట్టింపు లేదు ఎందుకని...
పెట్రోల్ బంకులు వాహన చోదకులకు అందుబాటులో ఉంచవలసిన సదుపాయా లు ఉన్నాయని అధికారులకు తెలిసిన, బంకులను చూసిన అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు వాహన చోదకులు అస హనం వ్యక్తం చేస్తుండ్రు.
ప్రభుత్వానికి చెల్లిం చవలసిన పనులను వాహన చోధకులు చెల్లించక పోతే ముక్కుపుండి వసూలు చేస్తు న్న అధికార యంత్రాంగం నిబంధనలు పా టించని బంకు యజమానుల పై మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావ డం లేదని కొందరు వాహనం చోదకులు ప్రశ్నిస్తున్నారు.
కల్పించవలసిన సదుపాయా లను కల్పించేందుకు సంబంధిత అధికారు లను ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించవలసి వస్తుందని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా నిబంధనలు పాటించని పెట్రోల్ బంకులపై అవసరమైన సదుపాయాలు క ల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారు లను వాహన చదువులు కోరుతుండ్రు.