calender_icon.png 29 April, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణాల చెల్లింపులతో బ్యాంకులు అభివృద్ధి

28-04-2025 07:39:23 PM

డిసిఓ మోహన్...

మంచిర్యాల (విజయక్రాంతి): బ్యాంకులలో ఖాతాదారులు తీసుకునే రుణాలు చెల్లింపులతోనే బ్యాంకులు అభివృద్ధి పథంలో నడుస్తాయని జిల్లా సహకార అధికారి(డీసీఓ) బి మోహన్ అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరము-2025 సందర్భంగా యూనివర్సల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో బ్యాంకు చైర్మన్ వినయ్ కుమార్, ఇన్చార్జి సీఈఓ కెవి ఎస్ ఎన్ మూర్తితో కలిసి మాట్లాడారు. బ్యాంకులో తీసుకున్న రుణం రికవరీ వలన కలిగే లాభాల గురించి సభ్యులకు వివరించారు. బ్యాంకు చిన్న, మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ సదస్సులో బ్యాంకు డైరెక్టర్లు కేశవరావు, జి కృష్ణమూర్తి, ఆర్ ప్రసాదరావు, జె శ్రీదేవి, జి రాయలింగు, శ్రీ బి భాను ప్రకాష్, కె బక్కయ్య, కే రత్నం, కే సుశీల, ఎస్ విజయలక్ష్మి, ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.