- ఆగస్టులో బ్యాంకులకు భారీగా సెలవులు
- జాబితా విడుదల చేసిన రిజర్వ్ బ్యాంకు
- ఒక వారంలో 5రోజులు, మరో వారంలో 3రోజులు వరుస సెలవులు
న్యూ ఢిల్లీ, జూలై 29: ఆగస్టు నెలలో బ్యాంకు ఉద్యోగులు పండుగ చేసుకోనున్నారు. వచ్చే నెలలో బ్యాంకులకు ఏకంగా ౧౩ రోజులు సెలవులు వస్తున్నాయి. సాధారణ సెలవులు, బ్యాంకులకే ప్రత్యేకమైన సెలవులు కలిపి ఒకే నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ఆగస్టులో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. ఆగస్టులో సాధారణ సెలవులు కూడా భారీగానే ఉన్నాయి. రెండు భిన్న వారాల్లో ఒక వారంలో వరుసగా ఐదు రోజులు, మరో వారంలో మూడు రోజులు సెలవు దినాలు వస్తున్నాయి.
సాధారణంగా బ్యాంకులకు ప్రతి ఆదివారంతోపాటు ఆ నెలలో వచ్చే ప్రతి రెండో శనివారం కూడా సెలవు ఉంటుంది. అంటే నెలలో నాలుగు శనివారాలు వస్తే రెండోది, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. వీటికి మరికొన్ని సాధారణ సెలవులు తోడు కావటంతో ౧౩ రోజులు సెలవులు వస్తున్నాయి. ఆగస్టు 3, 4, 8, 10, 11, 13, 15, 18, 19, 20, 24, 25, 26 సెలవు దినాలు. అయితే, వీటిలో కొన్ని దేశంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. అందువల్ల దేశంలోని అన్ని బ్యాంకులకు ౧౩ రోజులు సెలవులు ఉండవు.
ఆగస్టులో బ్యాంకు సెలవులు
- ౩ (శనివారం): కేర్ పూజ సందర్భంగా అగర్తల ప్రాంతంలో బ్యాంకులకు సెలవు
- 4 (ఆదివారం): సాధారణ సెలవు కావటంత దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత
- 8 (సోమవారం): తెండోంగ్ లో రుమ్ ఫాత్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు
- 10 (శనివారం): రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
- 11 (ఆదివారం): సాధారణ సెలవు
- 13 (మంగళవారం): పేట్రియాట్స్ డే సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు
- 15 (గురువారం): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సాధారణ సెలవు
- 18 (ఆదివారం): సాధారణ సెలవు
- 19 (సోమవారం): రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్ ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్.
- 20 (మంగళవారం): నారాయణగురు జయంతి సందర్భంగా కోచిలో బ్యాంకులకు సెలవు.
- 24 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు బంద్.
- 25 (ఆదివారం): సాధారణ సెలవు
- 26 (సోమవారం): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గుజరాత్, ఒడిశా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్‌ప్రదేశ్, శ్రీనగర్‌లో సెలవు.