రుణమాఫీ డబ్బులు జమ కావడంతో సందడి
కామారెడ్డి, ఆగస్టు 5(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హమీలో భాగంగా మొదటి విడతగా లక్ష రూపాయల చొప్పున మాఫీ చేసి రైతుల ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో మొదటి విడతలో 49,541 మంది రైతులకు రుణమాఫీ కాగా.. రెండో విడతలో రూ.లక్షా 50 వేల చొప్పున 24,816 మంది రైతులకు రూ.211.72 కోట్లు మంజూరయ్యా యి. రైతులు సోమవారం బ్యాంక్‌లకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బ్యాంక్ సమయం ముగిసే వరకు బ్యాంక్ ఎదుట, బ్యాంక్ లోపల రైతులతో సందడి నెలకొంది. బ్యాంక్ అధికారు లు ఉపిరి పీల్చుకోలేని విధంగా రైతులు రుణమాఫీ డబ్బులు తీసుకునేందుకు తరలివచ్చారు. బ్యాంక్‌ల్లో డబ్బులు అయిపోయి, వేచి చూడాల్సి వచ్చిది.