calender_icon.png 23 January, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీల్లో పైసల్లేవ్!

16-07-2024 02:04:59 AM

  • నిండుకున్న ఖజానా 
  • నిధులు లేక పనులు చేయలేకపోతున్న కార్యదర్శులు 
  • ఐదు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆగిన నిధులు 
  • కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి

పంచాయతీల్లో పైసలు లేకుండా పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో జీపీల ఖజానా నిండుకుంది. ఓ వైపు ట్రాక్టర్ల కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు మల్టీపర్పస్ కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి. పంచాయతీ కార్యదర్శులకు పాలన భారంగా మారుతోంది. అత్యవసరమైన పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాల కోసం కార్యదర్శులు తమ జేబుల్లో నుంచి సర్దుబాటు చేస్తున్నప్పటికీ నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వారు కూడా చేతులెత్తేస్తున్నారు.

వికారాబాద్, జూలై 15 (విజయక్రాంతి): వానకాలం మొదలైంది. అసలే ఇది సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం. వీధులు, పరిసరా లు ఏ మాత్రం అపరిశుభ్రంగా ఉన్నా ప్రజ లు రోగాలు బారినపడే అవకాశం ఉంది. అ యితే వీధులను శుభ్రం గా ఉంచుదామంటే అవసరమ య్యే ఖర్చు డబ్బులు గ్రామ పం చాయతీల ఖజానాల్లో లేవు. నిధులు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. జీపీల్లో డబ్బుల్లేక మల్టీపర్పస్ వర్కర్లకు, ఇతర సిబ్బందికి దాదా పు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.

ప్రతి నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జీపీల ఖాతాల్లో జ మ కావాల్సిన నిధులు రావడం లేదు. జిల్లా లో కొన్ని పంచాయతీలకు మాత్రమే ఆదాయం ఉంటుంది. అలాంటి చోట కార్యదర్శులు నెగ్గుకొస్తున్నా రు. కానీ మిగతా పంచాయతీల పరిస్థితి దయనీయంగా తయారైంది. విద్యుత్ దీపాల నిర్వహణ, బిల్లుల చెల్లింపులు, తాగునీటి పథకాల నిర్వహణ, మోటార్ల మర మ్మతు ఇలా ప్రతి పనికి డబ్బులు అవసరం. కానీ మెజార్టీ పంచాయతీల్లో డబ్బులు లేకపోవడం సమస్యగా మారింది. దీంతో కార్య దర్శులు అప్పులు చేసి పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది.

అంటువ్యాధులు ప్రబలే కాలం..  

వర్షకాలం సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తోంది. గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉం ది. జిల్లా కలెక్టర్, డీపీవో సహా ఇతర అధికారులు ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామాలను శుభ్రంగా ఉంచాలని, అంటువ్యాధులు రాకుండా జాగ్రతలు తీసుకో వాలని ఆదేశిస్తున్నారు. కానీ అందుకు అవసరమైన డబ్బులు జీపీల ఖాతాల్లో ఉన్నా యా.. లేవా..? అనే విషయం మాత్రం మర్చిపోతున్నారు. శానిటేషన్ పనులు చేయ డానికి డబ్బులు లేక, పై అధికారుల ఆదేశాలు అమలు చేయలేక కార్యదర్శులు సత మతమవుతున్నారు.

జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉండగా, దాదాపు 80 శాతం గ్రామ పంచాయతీల్లో ఏ మాత్రం డబ్బులు లేవు. పెద్ద పంచాయతీ, వ్యాపార కేంద్రాలుగా ఉన్న గ్రామాల్లో ఆదాయ వనరులకు కొంత కొదువ లేదు. మిగతా పం చాయతీల్లో డబ్బులు లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఎస్‌ఎఫ్‌సీ నిధులు ప్రభుత్వం ప్రతి నెలా సర్దుబాటు చేసేది. అయితే, గతేడాది ఫిబ్రవరిలో విడుదల కాగా, ఇప్పటి వరకు నయా పైసా రాలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా అందాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడంతో జీపీలకు కష్టకాలం వచ్చిపడింది. 

ముందే సర్దుకున్న సర్పంచులు.. 

పదవీ కాలం ముగుస్తుందని తెలిసి  సర్పంచులు అభివృద్ధికి ఖర్చు చేసిన బిల్లులకు సంబంధించి ఖజానాలో ఉన్న డబ్బులను తీసేసుకున్నారు. ఇంకా చాలా మంది సర్పంచులకు  బిల్లులు రావాల్సి ఉంది. సాధారణంగా మార్చి ఆఖరు వరకు పంచాయతీల్లో బకాయిలతో పాటు రెగ్యులర్ పన్నులు వసూలు చేస్తా రు. అయితే, పాలక వర్గాల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ముందుగానే చాలా చోట్ల పన్నులు వసూళ్లు చేశారు. వసూళ్లు చేసిన డబ్బులను పంచాయతీ అవసరాలకు ఖర్చు చేశారు.

జీపీలకు ప్ర త్యేక అధికారులను నియమించినా వారు చుట్టపు చూపులా వచ్చి పోతున్నారు. బా ధ్యత అంతా పంచాయతీ కార్యదర్శులే మోయాల్సి వస్తోంది. విద్యుత్ దీపాల నిర్వాహణ, బోరు మోటార్ల మరమ్మతు లు వంటి ఏ అవసరం ఉన్నా కార్యదర్శు లు సర్దుబాటు చేస్తున్నారు. అయితే ఎక్కు వ మొత్తంలో డబ్బులు అవసరం అయినప్పుడు వారు చేతులు ఎత్తేస్తున్నారు. పం చాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల ఈఎంఐలు కూడా పెండింగ్‌లో ఉంటున్నాయి. గత ఐదు నెలల కాలంలో పంచాయతీ కార్యదర్శులు తమ జేబు నుంచి రూ. 30 వేల పైచిలుకు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.