తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా విస్తరించలేదు. స్మార్ట్‌ఫోన్లలో ఎన్ని యాప్‌లు ఆర్థిక లావాదేవీలకు అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామీణులు ఇప్పటికీ బ్యాంకులనే ఎక్కువ విశ్వసిస్తారు. కానీ చాలా గ్రామాలకు బ్యాంకులు కానీ, ఏటీఎంలు కానీ అందుబాటులో లేవు. గ్రామాల జనాభాను దృష్టిలో కనీసం పది కిలోమీటర్లకు ఒక బ్యాంకు కానీ, ఏటీఎం కానీ ఏర్పాటు చేస్తే గ్రామీణలకు సౌకర్యవంతంగా ఉంటుంది. సంబంధిత అధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్