calender_icon.png 23 February, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడానికి బ్యాంకర్స్ సహకరించాలి

21-02-2025 12:24:48 AM

బ్యాంకర్స్ సమావేశంలో కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): మహిళలు,రైతు రుణాలు మరియు రాష్ట్ర కేంద్ర పథకాల రుణాల  మంజూరుపై ప్రత్యేక దృష్టి  పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం రోజు మినీ మీటింగ్ హల్‌లో  బ్యాంకర్ల తో 2024-25 డిసెంబర్ త్రైమాసిక డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు.

యువత, స్త్రీలకు ఉన్న ఉపాధి అవకాశాలపై వారికి అవగాహన కల్పించి అట్టి రంగాలలో వారి అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా  ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు బ్యాంక్ ప్రతినిధులకు సూచించారు.

అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బ్యాంకు లింకేజ్  రుణాలు పెండింగ్ పెట్టకుండా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్   బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లా డుతూ స్వయం సహాయక సంఘాల రుణాలను శీఘ్రంగా అందించాలని తెలిపారు.

కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా సామాజిక ప్రయోజనాలను సాధించడానికి బ్యాంకుల సహకారం కీలకమని కలెక్టర్ స్పష్టంచేశారు .

ఈ సమావేశంలో గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహణ అధికారి శోభారాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ, ఆర్.బి.ఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మీస్ శ్రావ్య, నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వినయ్ కుమార్, ఈ డి ఎస్ సి కార్పొరేషన్ జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.