calender_icon.png 13 March, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాధాన్యతారంగ రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి

12-03-2025 11:30:50 PM

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఈనెల మా సాంతానికి తానికి ప్రాధాన్యత రుణాల లక్ష్యాన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 2024-25 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసిక డీసీసీ, డీఎల్ ఆర్సీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఆర్థిక సంవత్సర ముగింపులోగా రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని బ్యాంకర్లకు  సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటూ, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా, రైతులకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆదాయం పెంచే విధంగా వివిధ ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తోందనీ, బ్యాంక్ అధికారులు అర్హత కలిగిన వారికి రుణాలు సకాలంలో ఇవ్వడం ద్వారా లక్ష్యాలు సాధించవచ్చు అన్నారు.

వార్షిక ఋణ ప్రణాళిక (ACP) కింద బ్యాంకుల పనితీరు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఎజెండా అంశాలు మొదలైనవాటిని సమీక్షించారు. రాబోవు 2025-26 ఆర్థిక సంవత్సరానికి  నాబార్డ్ ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను జిల్లా కలెక్టర్  జితేష్  వి పాటిల్ ఆవిష్కరించారు. నాబార్డ్ ప్రతి  జిల్లాకు ప్రతి సంవత్సరం పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ [పిఎల్‌పి]ని సిద్ధం చేస్తుంది.  ప్రాధాన్యతా విభాగంలో జిల్లాలో అందుబాటులో ఉన్న భౌతిక మరియు ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. దీని ఆధారంగా, జిల్లాలోని లీడ్ బ్యాంక్ వివిధ బ్యాంకుల ద్వారా అమలు చేయడానికి వార్షిక జిల్లా క్రెడిట్ ప్లాన్ (ACP)ని సిద్ధం చేస్తుంది.

నాబార్డ్ పీఎల్పీ ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు:

పంట ఉత్పత్తి, నిర్వహణ మరియు మార్కెటింగ్ కోసం రూ.2284.12 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం టర్మ్ లోన్  రూ.1362.50 కోట్లు, వ్యవసాయం మౌలిక సదుపాయాలు కోసం రూ.31.40 కోట్లు, అనుబంధ కార్యకలాపాలు కోసం రూ.159.96 కోట్లు, సూక్ష్మ చిన్న, మధ్యతరహా సంస్థలు(MSME) కోసం రూ.847.80 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగ రుణాలు రంగాలు విద్య హౌసింగ్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెన్యూవబుల్ ఎనర్జీ మొదలైనవి కోసం రూ.198.19 కోట్లు సహా జిల్లా మొత్తం ప్రాధాన్యతా రంగానికి రూ.4883.98 కోట్లుగా నాబార్డ్ ఆర్థిక అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో  పీడీడీఆర్డీఎ విద్యా చందన, నాబార్డ్ డీడీఎం సుజిత్ కుమార్, రిజర్వ్ బ్యాంక్ ఎల్డీఓ సాయి చరణ్ రెడ్డి, ఎల్డీఎం రామిరెడ్డి, బ్యాంక్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.