బెంగళూరు, జనవరి 17: వరుస బ్యాంకు చోరీలు కర్ణాటకలో కలకలం సృష్టిస్తున్నాయి. బీదర్‌లో ఏటీఎంలో డబ్బును నింపేందుకు వెళ్తున్న సిబ్బందిపై కొందరు దుండగులు గు రువారం కాల్పులు జరిపి మొత్తం సొమ్ము ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మరువక ముం దే శుక్రవారం మంగళూరులో దోపిడీ దొంగ లు రెచ్చిపోయారు.
కోటేకర్‌లోని కేసీ రోడ్డు లో ఉన్న వ్యవసాయ సహకార బ్యాంకులో ఉదయం 11.30 గంటలకు చొరబడి ఐదారుగురు ముసుగు దొంగలు బీభత్సం సృష్టిం చారు. తమ వద్ద ఉన్న కత్తులు, తల్వార్, పిస్తల్‌తో బ్యాంకు సిబ్బందిని బెదిరించి సుమా రు రూ. 10 విలువైన నగలు, ఆభరణాలతో కారులో పరారయ్యారు. సమాచా రం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం వేట ప్రారంభించారు. సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం దోపిడీకి పాల్పడిన వారి వయస్సు 25 ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
సీఎం అత్యవసర సమావేశం
కర్ణాటకలో జరుగుతున్న వరుస చో రీల పట్ల కర్ణాటక సీఎం సీరియస్ అ య్యారు. మంగళూరులో పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి.. దొంగలు ఎన్ని టోల్ గేట్లు దాటారు? టోల్ గేట్ల వద్ద భద్రతను ఎందుకు పెంచలేదు? దోపిడీ సమయంలో బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడానికి గల కారణాలు ఏంటనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.