calender_icon.png 16 January, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకులో చోరీకి యత్నం

04-08-2024 01:09:11 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 3(విజయక్రాంతి): దహెగాం మండ ల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శుక్రవారం రాత్రి దుండగులు చోరీకి యత్నించారు. ఎస్సై కందూరి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు ఉద్యోగులు రోజూలాగే శుక్రవారం సాయంత్రం 7.45 గంటలకు బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. రాత్రి 1.30 గంటలకు బ్యాంకులో శబ్దాలు రావడంతో భవనం యజమాని బ్యాంక్ మేనేజర్ నవీన్‌కు ఫోన్ చేసి చెప్పాడు. సిబ్బందితో కలసి మేనేజర్ అక్కడికి చేరు కుని, చూడగా తలుపులు బద్దలుగొట్టి ఉన్నాయి. పోలీసులకు సమా చారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీని సోషల్ మీడి యాలో పోస్టు చేయడంతో నిందితుడిని గుర్తించారు. చిన్న ఐనం గ్రామా నికి చెందిన అల్లకొండ రమేష్ చోరీకి యత్నించినట్లు గుర్తించి, శనివారం అరెస్టు చేశారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.