12-02-2025 10:46:55 PM
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి నగర్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ను బుధవారం హైదరాబాద్ జోనల్ మేనేజర్ జీఎస్ డీ ప్రసాద్, డిప్యూటీ మేనేజర్ కేఈ హరికృష్ణ ప్రారంభించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ కార్యాలయాన్ని బీఎన్ రెడ్డి నగర్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో మొత్తం 72 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలు ఉన్నారన్నారు. పేదలకు, చిన్నతరహా పరిశ్రమల వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తామన్నారు. స్థానిక ప్రజలకు అన్ని బ్యాంకింగ్, ఆర్థిక అవసరాలను తీర్చడానికి మహారాష్ట్ర బ్యాంక్ సేవలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో బీఎన్ రెడ్డి నగర్ బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు.