calender_icon.png 25 November, 2024 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు పారిశ్రామిక గ్రూప్‌లకు పునాది వేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

24-11-2024 12:00:00 AM

తొలి ప్రపంచయుద్ధం, మహా మాంద్యం నేపథ్యంలో ఇండియాలో విదేశీ యాజమాన్యంతో నడిచే  పలు బ్యాంక్‌లు దివాళా తీసిన నేపథ్యంలో స్వదేశీ యాజమాన్యం నేతృత్వంలో ఒక బ్యాంక్‌ను ఏర్పాటుచేయాలన్న సంకల్పంతో నెలకొన్నదే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మరా ఠా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఎంసీసీ) వ్యవస్థాపకుడు ఏఆర్ భట్ చొరవతో ఆర్థికవేత్త, విద్యావేత్త వీజీ కాలే, సహకార బ్యాంకింగ్ నిపుణుడు, వ్యాపారవేత్త డీకే సాథేలు బ్యాంక్ మహారాష్ట్రను 1935లో పూనేలో నెలకొల్పారు.

1936 ఫిబ్రవరి నుంచి ఈ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. పలు చిన్న వ్యాపారాలకు రుణాలిచ్చి, ఆ వ్యాపార సంస్థలు పెద్ద పారిశ్రామిక గ్రూప్‌లుగా ఎదగడంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాత్ర కీలకమైనది. 1969లో కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంక్‌ను జాతీయం చేసింది.

మహారాష్ట్రలో ఇతర పీఎస్‌యూ బ్యాంక్‌లకంటే బ్యాంక్ మహారాష్ట్రకు సహజంగానే అధికం. 2004లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేసి, ఆ షేరును స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేసింది. 

2,263 శాఖలు.. రూ.3.07 లక్షల కోట్ల ఆస్తులు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు దేశవ్యాప్తంగా 2023 జూన్ నాటికి 2,263 శాఖలు ఉన్నా యి.  13,499 మంది ఉద్యోగులు ఉన్నారు ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.3.07 లక్షల కోట్లు.  జాతీయం చేసిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లోకెల్లా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోనే కేంద్ర ప్రభుత్వానికి తక్కువగా 57.52 శాతం వాటా మాత్రమే ఉన్నది. దేశీయ ఫండ్స్ వద్ద 24 శాతం, విదేశీ ఇన్వెస్టర్ల వద్ద 10.71 శాతం చొప్పున వాటా ఉన్నది. ఈ  బ్యాంక్‌కు ప్రస్తుతం నిధు సక్సేనా ఎండీ, సీఈవోగా  వ్యవహరిస్తున్నారు. 

రూ.40,719 కోట్ల మార్కెట్ విలువ

స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుత మార్కెట్ విలువ రూ.40,719 కోట్లు.  గడిచిన మూడేండ్లలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేరు 175 శాతం పెరిగింది.