calender_icon.png 8 April, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ప్రారంభం

08-04-2025 01:09:54 AM

సూర్యాపేట, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర  బ్రాంచ్ ను (బివోఎం) సోమవారం  హైదరాబాద్ జోన్  జోనల్ మేనేజర్ ఎ ఈ ప్రసాద్, డిప్యూటీ జోనల్ మేనేజర్ హరి, కోదాడ బ్రాంచ్ ఉద్యోగులు, కస్టమర్ల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రజల అన్ని బ్యాంకింగ్, ఆర్థిక అవసరాలను తీర్చడానికి కోదాడలో  బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క అత్యాధునిక కొత్త శాఖ ప్రారంబించామని, ఇది కస్టమర్లకు సహయపడుతుందన్నారు. 

డిప్యూటీ జోనల్ మేనేజర్ మాట్లాడుతూ  ఇది కస్టమర్ యొక్క బ్యాంకింగ్ అవసరాలకు ఒక స్టాప్ షాప్ అని  ప్రస్తుతం భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు 5 కేంద్ర పాలిత ప్రాంతాలలో 2400 కంటే ఎక్కువ శాఖలతో 30 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తోందని తెలిపారు.