భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థల్లో వందే ళ్ల క్రి తం నెలకొన్న బ్యాంక్‌ల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. బొంబే (ప్రస్తుతం ముం బై)లో 1906 సెప్టెంబర్‌లో కాటన్ వ్యాపారి రామ్‌నారాయణ్ రూయాతో పాటు కొద్దిమంది వ్యాపారవేత్తలు కలిసి నెలకొల్పిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఆస్తుల రీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల తర్వాత 6వ పెద్ద బ్యాంక్‌గా కొనసాగుతున్నది.
రూ.50 లక్షల చెల్లింపు మూలధనంతో 50 మంది ఉద్యోగులతో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ ఇండియా శరవేగంగా విస్తరించింది. విదేశాల్లో సైతం కార్యాలయాల్ని, శాఖల్ని నెలకొల్పింది. 1969 వరకూ ప్రైవేటు బ్యాంక్‌గానే కొనసాగిన బ్యాంక్ ఆఫ్ ఇండియాను మరో 13 ఇతర బ్యాంక్‌లతో పాటు జాతీయం చేశారు. దీనితో బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా రూపాంతరం చెందింది.
1997లో తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2208లో కేంద్ర ప్రభుత్వం మరికొంత వాటా ను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించింది. పీఎస్‌యూ బ్యాంక్‌ల్లో పూర్తిగా కం ప్యూటరీకరించిన శాఖను తొలిసారిగా (1989లో ముంబై మహాలక్ష్మి శాఖ) ప్రారంభించింది బ్యాంక్ ఆఫ్ ఇండియానే.
15 విదేశాల్లో కార్యకలాపాలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఐదు ఖండాల్లో 15 విదేశాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నది. ఈ బ్యాంక్ భారత్ వెలుపల టోక్యో, హాంకాంగ్, సింగపూర్, లండన్, ప్యారిస్, న్యూయార్క్, దుబాయ్ తదితర నగరాల్లో 4 సబ్సిడరీలతో సహా 47 శాఖలు/కార్యాలయాల్ని నిర్వహిస్తున్నది.
రూ.47,700 కోట్ల మార్కెట్ విలువ
స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.47,721 కోట్లు. గడిచిన మూడేండ్లలో బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 2 రెట్లు పెరిగింది. ప్రస్తుతం రూ.105 సమీపంలో ట్రేడవుతున్నది.
5,100కుపైగా శాఖలు.. రూ.9 లక్షల కోట్ల ఆస్తులు
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా5,100 పైగా శాఖలు ఉన్నాయి.5,500 పైగా ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 2024 మార్చినాటికి 50,944 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.9.13 లక్షల కోట్లు. ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 73.38 శాతం వాటా ఉన్నది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం రజనీష్ కర్నాటక్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.