calender_icon.png 17 October, 2024 | 12:59 PM

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ స్కీమ్

28-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పండుగ బహుమతిగా రూ.3 కోట్ల లోపు మొత్తానికి ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ఒక ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 400 రోజులు కాల పరిమితిగల ఈ రిటైల్ టెర్మ్ డిపాజిట్‌పై (రూ.1 కోటిపైబడిన నాన్ డిపాజిట్) సూపర్ సీనియర్ సిటిజన్లకు  8.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం, ఇతర ఖాతాదారులకు 7.45 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన తెలిపింది.

ముందస్తు విత్‌డ్రాయిల్ ఆప్షన్‌తో కాలబుల్ డిపాజిట్‌పై  సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, ఇతర ఖాతాదారులకు 7.30 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొం ది.

ఈ 400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ దేశీయ పౌరులతో పాటు ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో డిపాజిటర్లకూ అందుబాటులో ఉంటు ంది. 2024 సెప్టెంబర్ 27 నుంచి తమ బ్యాంక్ అన్ని శాఖల్లోనూ,  డిజిటల్ చానళ్లలో (బీవోఐ ఓమ్ని నియో యాప్/ఇంటర్నెట్ బ్యాంకింగ్) ఈ డిపాజిట్ చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా            వివరించింది.