calender_icon.png 8 October, 2024 | 5:01 AM

బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బ్రాండ్

08-10-2024 02:42:30 AM

అంబాసిడర్‌గా సచిన్ తెండూల్కర్

ముంబయి: భారత దేశంలో అత్యుత్తమ విశ్వసనీయ బ్యాంకుల్లో ఒకటయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తమ బ్యాంక్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్ తెండూల్కర్‌ను ఎంపిక చేసుకున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా సచిన్‌తో కలిసి తమ మొదటి ప్రచారాన్ని‘ ప్లే ది మాస్టర్ స్ట్రోక్’ పేరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రారంభించింది.

లక్షలాది మంది విశ్వసించే, శతాబ్దానికి పైగా వారసత్వం ఉన్న బ్యాంకును ఎంచుకోవడం ద్వారా తమ ఆర్థిక ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి మాస్టర్ స్ట్రోక్ ఆడమని, పెద్ద స్కోర్ చేయమని ఈ ప్రచారం ప్రజలను ప్రోత్సహిస్తుంది.

ఈ భాగస్వామ్యం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ దేబదత్త చంద్ మాట్లాడుతూ భారత దేశ క్రీడా దిగ్గజాల్లో ఒకరైన సచిన్ తెండూల్కర్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకోవడాన్ని బ్యాంక్ గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

సచిన్‌తో భాగస్వామ్యం ఏర్పర్చుకోవడానికి, ఈ అను బంధానికి జీవం పోయడానికి తాము సంతోషిస్తున్నామని తెలిపారు. ఖాతాదారుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా రూపొందించిన వివిధ పథకాల గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు.