calender_icon.png 20 April, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి

03-04-2025 01:02:14 AM

సిద్దిపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి):  రైతులు సకల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు మారెడ్డి రాంలింగా రెడ్డి ఆరోపించారు. రైతులకు బ్యాంకులలో సకాలంలో రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నిలపెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాపి చేసి ఆదుకుంటామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో మాత్రం చూపించడం లేదన్నారు. రైతు భరోసా కోసం రైతుంగం ఎదురుచేస్తున్నారని చెప్పారు.

జిల్లాలో వరి కోతలు ప్రారంభం కావస్తుందని,  రైతులు కస్టపడి పండించి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలను  నెరవేర్చలని కోరుతూ ఈ నెల 7 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నీరసన చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా  ప్రధాన కార్యదర్శి పన్యాల విష్ణు వర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అయిలేని మల్లికార్జున రెడ్డి, నాయకులు సామల రాజేశం, మోతుకుల  లక్ష్మన్,  యాదం రావు ,  తిరుపతి రెడ్డి , కొలన్ పాక  భూపాతి రెడ్డి, పోతుగంటి వెంకట్, రాం రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.