మన దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకు ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి ఐబీపీ ఎస్ రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటితో దేశ వ్యాప్తంగా 4455 పీఓ, 896 ఎస్ఓ పోస్టులు భర్తీ అవనున్నాయి. ింతవరకూ కేవలం 6 బ్యాంకులు తమ ఖాళీల వివరాలు ప్రకటించాయి. మిగిలిన ఐదింటిలో ఎక్కువ బ్రాంచీలున్న బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు ఉన్నాయి.