calender_icon.png 9 January, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు వినియోగదారులకు కోటికిపైగా టోకరా..!

04-08-2024 11:01:19 AM

ప్రభుత్వ బ్యాంకులో ప్రయివేటు వ్యక్తికి కీ..

ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు వడి కస్టమర్ల డబ్బులు స్వాహా..

నేడు లేవు అంటూ తిప్పుకోవదుతో అక్రమాలు వెలుగులోకి...

పెద్దకొత్తపల్లి మండలం పెద్దకాఆర్పాముల వంజాబ్ నేషనల్ బ్యాంకు అక్రమాలు వెలుగులోకి. 

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): ఓ ప్రయివేటు వ్యక్తి ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు వడి బ్యాంకులో చెలామణి అవుతూ ఏకంగా బ్యాంకు కస్టమర్ల డబ్బులు స్వాహా చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మందలం పెద్దకార్పాముల పంజాబ్ నేషనల్ బ్యాంకులో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెలితే... పెద్దకార్పాముల గ్రామానికి చెందిన దేవేందర్ అనే వ్యక్తి చిన్నకార్పాముల, రాయవరం గ్రామాలకు పంజాబ్ నేషనల్ బ్యాంకు వరిదిలోని బిజినెస్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాడు.. కాగా తాను ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడి కస్టమర్లు ఇచ్చే డబ్బులను బ్యాంకులో జను చేయకుండా, విత్ డ్రా చేసిన డబ్బులు వారికి ఇవ్వకుండా సర్వర్ ప్రాబ్లమ్, ఇతర కారణాలు చెబుతూ డబ్బులను తానే వాడుకునే వాడు. ఇలా ఓవ్యక్తి 3తులాల 8గ్రాముల బంగారం రుణం తీసుకోగా 1.84వేలకు కేవలం 84వేలు ఇచ్చి సర్వర్ రావడం లేదు మరుసటి రోజు ఇస్తానంటూ తిప్పుకుంటూ కాలం వెల్లదీశాడు.

మరో వ్యక్తి వద్ద 69వేలు నగదు ఫోన్ పే ద్వారా తన అకౌంట్లోకి వేసుకుని ఇప్పుడూ అప్పుడూ అంటూ డబ్బులు ఇవ్వకుండా తిప్పాడు. ఇలా కాతాదారుల నుండి సుమారు 50 లక్షల వరకు డబ్బులు ఇవ్వకుండా వారిని తిప్పడుతో శనివారం బాదితులంతా పెద్దకొత్తపల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు అదే బ్యాంకులో నిత్యం రుణాలు, బ్యాంకు లావాదేవీలల్లో కంపూటర్ల ముందు ఆపరేట్ చేస్తూ కనిపించదంతో కోట్లల్లో అక్రమాలు జరిగి ఉంటాయోనని బ్యాంకు కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన బ్యాంకు మేనేజర్ పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి.