calender_icon.png 19 April, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

12-04-2025 12:00:00 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : ఇండియన్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు శుక్రవారం లిబర్టీ ప్లాజాలోని ఇండి యన్ బ్యాంక్ ఫీల్ జనరల్ మేనేజర్, జోనల్ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్(ఎఫ్‌ఐబిఇయు) పిలుపు మేరకు జంట నగరాల్లో పనిచేస్తున్న ఇండియన్ బ్యాంక్ వందలాదిమంది ఉద్యోగులు ఈ ప్రదర్శనలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా హాజరైన ఎఫ్‌ఐబిఇయు సెక్రటరీ జనరల్ ఇ.అరుణాచలం, అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్(ఎఐబిఇఎ) జాతీయ కార్యదర్శి బిఎస్. రాంబాబు, ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్(ఎపి, టిఎస్) జనరల్ సెక్రటరీ పివి.కృష్ణారావులు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ లో ఉన్న సాధారణ ఖాళీలలో క్లరికల్ స్టాఫ్, సబ్-స్టాఫ్, స్వీపర్లు, డ్రైవర్లను తగినంతగా నియమించాలన్నారు.

అలహాబాద్ బ్యాంక్‌ను ఇండియన్ బ్యాంక్ విలీనం చేసిన తర్వాత ఉద్యోగులకు ఇంటిగ్రేటెడ్ ట్రాన్సఫర్ పాలసీని, పెండింగ్ ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేట్టాలన్నారు. బ్యాంకులో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనాలు, బోనస్ చెల్లించాలన్నారు. బ్యాంకులో ఉన్న శాశ్వత ఖాళీల లో తాత్కాలిక ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 19న అన్ని జోనల్, ఎఫ్.జి.ఏం కార్యాలయాల ముందు ధర్నాను, చివరకు ఏప్రిల్ 25న ఒక రోజు సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యోగ నియామకాలను కోరుతూ మరిన్ని సమ్మెలకు సిద్ధంగా ఉండాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మానికి యూనియన్ అధ్యక్షుడు ఎం.ఎస్. కుమార్ అధ్యక్షత వహించగా, జాయింట్ జనరల్ సెక్రటరీ జి.నల్లప్ప రెడ్డి, మహిళా కౌన్సిల్ కన్వీనర్ జి.పద్మ పాల్గొన్నారు.