calender_icon.png 27 December, 2024 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు ఏజెంట్ మోసం.. అర్ధనగ్నంగా ఖాతాదారుని నిరసన

07-11-2024 12:31:47 PM

ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని మేనేజర్ కు వినతి 

నిజామాబాద్ (విజయక్రాంతి): బ్యాంకులో రుణం తీసుకొని వాయిదాలు ఏజెంట్ కు చెల్లించడంతో అతడు సక్రమంగా బ్యాంకులో జమ చేయ లేదు. ఏజెంట్ మోసాలను నిరసిస్తూ ఓ ఖాతాదారుడు బ్యాంక్ ఎదుట గురువారం అర్థ నగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసిన సంఘటన ఇది. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రం కు చెందిన జనార్ధన్ అనే బాధితుడు కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో తన అవసర నిమిత్తం వ్యక్తిగత రుణాన్ని తీసుకున్నాడు. డబ్బులు నెలసరి కిస్తులు ఏజెంట్ కు చెల్లించాడు. బ్యాంక్ ఏజెంట్ మాత్రం జనార్ధన్ ఇచ్చిన కిస్తీలు బ్యాంకులో జమ చేయకపోవడంతో తన సిబిల్ స్కోర్ పడిపోయింది.

వెంటనే బ్యాంకుకు వెళ్లి తెలుసుకోగా నెలసరి కిస్తీలు పూర్తిగా చెల్లించలేదని బకాయి ఉన్నట్లు మేనేజర్ తెలిపారు. ఈ విషయంపై ఏజెంట్ నవీన్ ను ప్రశ్నించగా ఇంకా రుణానికి సంబంధించిన కిస్తీలు చెల్లిస్తే గాని రుణాలు రావని చెప్పడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు, పోలీసులు ఏజెంట్ నవీన్ ను పిలిచి జనార్దన్ కు సంబంధించిన బకాయి ఉన్న కీస్తీలు చెల్లించాలని కోరగా తాను చెల్లిస్తానని చెప్పి బ్యాంకులో చెల్లించలేదు. దీంతో బాధితుడు జనార్ధన్ గురువారం కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తాను చెల్లించిన డబ్బులను ఏజెంట్ బ్యాంకులో జమ చేయడం లేదని తాను నష్టపోతున్నానని తనకు రావాల్సిందే డబ్బులు ఏజెంట్ ద్వారా ఇప్పించి బ్యాంకులో జమ చేయాలని కోరారు. బ్యాంక్ మేనేజర్ స్పందించి ఏజెంట్ ని పిలిపించి జనార్ధనకు రావలసిన డబ్బులను ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో జనార్ధన్ నిరసన విరమించారు.