యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): భువనగిరి పట్టణం బంజాహిల్స్ కాలానిలో ఉన్న బంజార ప్రజలు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీజ్ పండుగతో బంజార ఆడ బిడ్డల పండుగ, పాడి పంటలు పచ్చగా వుండాలని, ఆడపిల్లలకు మంచి జరగాలని గోదుమలు, శనిగలు చల్లి, విత్తనాలు మెులకేత్తి పెద్దకాగానే తీజ్ ను తెంపి అక్కడ పెద్దమనుషుల పగడిలో పేట్టి ఆనందాన్ని పంచుకుంటారు. ఈ పండుగలో వారు తొమ్మిది రోజులు నిష్టతో పూజలు జరుపుతారు. తరువాత ఆ బుట్టలను చేవురులో నిమజ్జనం చేసి ఆ నీళ్ళతో ఆడబిడ్డల కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సీపాల్ చైర్మెన్ పోతంశెట్టి వెంకటేష్, స్థానిక కౌన్సీలర్ భానోతు వెంకట్ నర్సింగ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షులు కూర వెంకటేష్, జిల్లా మహిళ అధ్యక్షురాలు నీలం పద్మ,బట్టు రాంచదర్, సీపీఎం నాయకులు పాండు, బీఆర్ఎస్ నాయకులు రాజేష్ నాయక్, లక్ష్మిబాయి, భాస్కర్ నాయక్, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.