calender_icon.png 15 November, 2024 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా సంగీతం

13-11-2024 12:00:00 AM

బంజారాలకు డపుడియా, భాట్లు, ధాడీలు అనే మూడు సాంస్కృతిక ఉపతెగలు ఉన్నాయి. భాట్లు సారంగివాద్యం వాయిస్తారు. ధాడీలు రబాబ్ తంత్రీ వాద్యం వాయిస్తారు. వీరు పృథ్విరాజ్ చౌహాన్ కథని గానం చేస్తారు. బంజారాల సంగీతంలో చిరతలు, తాళాలు, నగారాలు వాయిస్తారు. బంజారాల నృత్యం కూడా విలక్షణంగా ఉంటుంది. సంగీత వాద్య నాదాలను రహస్య భాషగా ఉపయోగిస్తారు.

మీరు ఇక్కడకు రండి, అందరు కలిసి కుడివైపు పొండి వంటి విషయాలను డప్పు తదితర వాద్యాలపై మోగించి శ్రోతలకు తెలియచేస్తారు. ఆ విధంగా అవి సమాచార ప్రసారానికి తోడ్పడతాయి. తెలంగాణలో బంజారా సంగీతం గ్రామీణ ప్రాంతాల్లో మారుమోగుతున్నది.