తదుపరి చర్యలపై ఉత్కంఠ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): ఫార్ము లా ఈ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డితోపాటు సీఐ రాఘవేందర్ ఏసీబీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏఞూ 2 నింధితుడిగా ఉన్న ఎంఏయూడీ మాజీ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ బుధవారం ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో బందోబస్తు, ఇతర ఏర్పాట్ల గురించి చర్చించేందుకు వచ్చినట్టు సమా చారం. మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించి నట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారులతో సమావేశమైన అనంత రం తిరిగి వెళ్లిపోయారు. ఏసీబీ, పోలీసు అధికారులు సమావేశం కావడంతో ఉత్కంఠ నెలకొంది.