calender_icon.png 25 March, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తాం

23-03-2025 08:00:32 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు...

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ... బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ సమాజ హితం కోసం చూపిన మార్గం సదా అనుసరణీయమని అన్నారు. ఆయన బోధనలు ఆదివాసీ, గిరిజన సమాజ అభ్యున్నతికి తోడ్పడటమే కాకుండా సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చాయని పేర్కొన్నారు.

సేవాలాల్ మహారాజ్ శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు, సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు తన జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, బంజారా సోదరుల కోరిక మేరకు జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.