కొచ్చి: కొచ్చిలో అక్రమంగా ఉంటూ పని చేస్తున్న 34 మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఎర్నాకుళం జిల్లాలోని నార్త్ పరవూర్ ప్రాంతం(North Paravur area of Ernakulam district)లో ఎర్నాకులం రూరల్ పోలీసులు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ జాతీయులు(National of Bangladesh) పశ్చిమ బెంగాల్ నుండి వలస వచ్చిన కార్మికుల ముసుగులో వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని, అరెస్టయిన వారిని వివరణాత్మకంగా విచారిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు వారాల క్రితం 28 ఏళ్ల తస్లీమా బేగం అరెస్టు తర్వాత ఎర్నాకులం రూరల్ జిల్లా పోలీసు చీఫ్(District Police Chief (Ernakulam Rural) Vaibhav Saxena) వైభవ్ సక్సేనా ప్రారంభించిన 'ఆపరేషన్ క్లీన్'(Operation Clean) ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.