యూనస్ ప్రభుత్వం
ఢాకా, జనవరి 6: వచ్చే నెలలో భారత్‌లో జరిగే 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు, న్యాయాధికారుల శిక్షణా కార్యక్రమాన్ని ఆ దేశం రద్దు చేసుకుంది. ఈ మేరకు బంగ్లా ప్రభుత్వ సారథి మహమ్మద్ యూన స్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్‌కు చెం దిన న్యాయమూర్తులకు శిక్షణ ఇవ్వనున్నారు.
దీనిని రద్దు చేసుకుంటున్న ట్లు బంగ్లాదేశ్ న్యాయమంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ మధ్య మరిం త దూరం పెరిగినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షురాలు షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు.
అప్పటి నుంచి భారత్ మధ్య సంబంధాలు క్షీణించాయి. యూనస్ ప్రభుత్వం ఏర్పడగా.. హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి భారత్ మధ్య దూరం పెరుగుతూనే ఉన్నది.