కింగ్స్‌టౌన్: పొట్టి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజా విసిరింది. సోమవారం గ్రూప్ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగులతో విజయం సాధించి సూపర్ బెర్తును ఖరారు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు పెద్దగా లేవు. షకీబ్ అల్ హసన్ (17), మహ్మదుల్లా (13), రిషద్ హొసెన్ (13) పర్వాలేదనిపించారు. నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బంగ్లాదేశ్‌కు పరుగులు రావడం గగనమైంది. నేపాల్ బౌలర్లలో సందీప్, సోమ్‌పాల్ కామి, రోహిత్, దీపేంద్ర సింగ్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌటై పరాజయం చవిచూసింది. కుషాల్ మల్లా (40 బంతుల్లో 27), దీపేంద్ర సింగ్ (31 బంతుల్లో 25) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ నేపాల్‌ను గెలిపించడంలో విఫలమయ్యారు. బౌలింగ్‌కు పూర్తిగా సహకరించిన పిచ్‌పై చెలరేగిపోయిన బంగ్లా బౌలర్లు వికెట్లు తీయడంలో పోటీ పడ్డారు. తంజిమ్ హసన్ 4 వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించగా.. ముస్తాఫిజుర్ 3, షకీబ్ 2, తస్కిన్ 1 వికెట్ పడగొట్టి మిగతా పనిని పూర్తి చేశారు. కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ నమోదు చేసిన తంజిమ్ (4 ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.