కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 1 డ్రాగా ముగించింది. జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 101 పరుగులతో ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 287 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విండీస్ 185 పరుగులకే కుప్పకూలింది. కవెమ్ హడ్జ్ (55) టాఫ్ స్కోరర్‌గా నిలవగా.. బ్రాత్‌వైట్ (44) పర్వాలేదనిపించాడు.
బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 5 వికెట్లు తీయగా.. హసన్ మహుముద్, తస్కిన్ అహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 193/5 క్రితం రోజు స్కోరుతో నాలుగోరోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. జాకర్ అలీ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. విండీస్ బౌలర్లలో రోచ్, అల్జారీ చెరో 3 వికెట్లు పడగొట్టాడు. విండీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు 15 ఏళ్ల తర్వాత టెస్టుల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం.