విండీస్‌తో రెండో టెస్టు
కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 41.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. జాకర్ అలీ (29*), తైజుల్ ఇస్లామ్ (9*) క్రీజులో ఉన్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ 211 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. కీసీ కార్టీ (40), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (39) మినహా మిగతావారు విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రానా ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరవగా.. హసన్ మహ్ముద్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌట్ అయింది.