చట్టోగ్రామ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లా దేశ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మరో 537 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో రబాడ రెండు వికె ట్లు పడగొట్టాడు. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 575/6 వద్ద డిక్లేర్ చేసింది. ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ (105 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు.