calender_icon.png 19 April, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ క్షమాపణకు బంగ్లాదేశ్ డిమాండ్

18-04-2025 11:31:37 PM

8 1971 నాటి అఘాయిత్యాలపై

15 ఏళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య చర్చలు

ఢాకా: షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనమైన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి.  తాజాగా శుక్రవారం 15 ఏళ్ల అనంతరం బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా 1971 నాటి అఘాయిత్యాలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేయడం గమనార్హం. అలాగే పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారిన సమయంలో ఉన్న ఉమ్మడి ఆస్తుల్లో తమ వాటాగా 4.3 బిలియన్ డాలర్లు చెల్లించాలని కోరింది. ఈ చర్చలు పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. బంగ్లాదేశ్ పర్యటనకు ముందు జరగడం గమనార్హం. ఢాకాలోని స్టేట్ గెస్ట్ హౌస్ పద్మలో జరిగిన ఈ చర్చల్లో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషిం ఉద్దీన్, పాక్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ పాల్గొన్నారు. జషిం ఉద్దీన్ మాట్లాడుతూ.. ‘మేము చారిత్రాత్మకంగా పరిష్కరించని సమస్యల గురించి పాకిస్థాన్‌తో చర్చించాం’ అని అన్నారు. ఈ సమస్యలు పరిష్కారమైతే, పరస్పర ప్రయోజనాల కోసం బలమైన సంబంధాల పునాదిని వేసుకోవచ్చు’ అని తెలిపారు.