calender_icon.png 24 October, 2024 | 5:44 PM

ఓటమి దిశగా బంగ్లా

23-10-2024 12:00:00 AM

ఢాకా: సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటముగిసే సరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. హసన్ జాయ్ (38*), రహీం (31*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. ఇక బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే చాప చుట్టేసింది. అంతకముందు సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగుల భారీ స్కోరు సాధించారు.

సఫారీ వికెట్ కీపర్ వెర్రిన్నె (114) సెంచరీతో కదం తొక్కాడు. ఇక దక్షిణాఫ్రికా పాస్ట్ బౌలర్ కగిసో రబాడ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు (11,817 బంతులు) తీసిన తొలి బౌలర్‌గా రబాడ నిలిచాడు. ఇంతకముందు వకార్ యునిస్ (12, 602 బంతుల్లో), స్టెయిన్ (12, 605 బంతుల్లో) ఈ ఫీట్ అందుకున్నారు.