ఢాకా, నవంబర్ 11: బంగ్లాదేశ్ మరోసారి అట్టుడికింది. మహిళలు, అవామీ లీగ్ కార్యకర్తలపై విద్యార్థిలు, ప్రభుత్వ అనుకూల వర్గాలు విరుచుకుపడ్డాయి. నిషేధాజ్ఙలు, ప్రక్షాళనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఆదివారం నిరసనలకు పిలుపునిచ్చింది. అవామీ కార్యకర్తలు నిరసన లు తెలపడానికి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ పార్టీని ఫాసిస్ట్‌గా అభివర్ణించింది.
దీంతో లీగ్ కార్యకర్తలు ఢాకాలో నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ క్రమం లో అవామీ లీగ్ కార్యకర్తలపై నగర వ్యాప్తంగా దాడులు చోటు చేసుకున్నాయి. నగరంలోని కీలక ప్రదేశాల్లో అవామీ లీగ్ కార్యర్తలు గుమిగూడకుండా విదార్థులు అడ్డుకున్నారు. అవామీ లీగ్‌తో సంబంధం ఉందనే అనుమానంతో గులిస్థాన్ ప్రాంతంలో ఇద్దరు మహిళలు సహా మరో 8 మందిపై ప్రభుత్వ అనుకూల వర్గాలు దాడులు చేశాయి.