calender_icon.png 5 November, 2024 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లా వలసలను ప్రోత్సహిస్తున్నారు!

05-11-2024 01:15:00 AM

  1. జార్ఖండ్ సర్కార్ వారికి ఓటు హక్కు కల్పిస్తోంది
  2. ఇండియా కూటమిలో బుజ్జగింపులే ఉన్నాయి
  3. సోరెన్ పాలనపై ప్రధాని మోదీ విమర్శలు

రాంచీ, నవంబర్ 4: జార్ఖండ్ ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంటున్నది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరుగనున్నది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్నది. తాజాగా అధికారిక పార్టీ అయిన ‘జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)’పై ప్రధానమంత్రి మోదీ విమర్శ నాస్త్రాలు సంధించారు.

గర్వాలో సోమవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా నిలు స్తోందని, అంతేకాదు వారికి ఓటు హక్కు పొందేందుకు సహకరిస్తున్నదని ఆరోపించారు. సంకీర్ణ కూటమి ఇప్పుడు చొరబాటు దారుల కూటమిగా మారిందని చురకలంటించారు.

సంకీర్ణ ప్రభుత్వంలో బుజ్జగింపుల పర్వం నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. జార్ఖండ్ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులు సరస్వతి వందనం ఆలపించేందుకు అనుమతి ఇవ్వకపోవడం దారుణ మన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు ఇలాగే కొనసాగితే త్వరలో రాష్ట్రంలో ఆదివాసీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు.

కనీసం రాష్ట్రప్రభు త్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలైనా, సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌కు లభించడంతో చంపయ్ సోరెన్ సీఎం పదవి నుంచి తప్పించాలని జేఎంఎం నిర్ణయం తీసుకున్నద న్నారు. ఒక ఆదివాసీ నేతను ఇంత దారుణంగా అవమానించడం సిగ్గుచేటన్నారు. అలాంటి స్వార్థపూరిత పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

3 లక్షల మందికి ఉద్యోగాలిస్తాం..

‘నాకు కుటుంబం లేదు. మీరే నా కుటుంబం’ అని ప్రధాని మోదీ అన్నారు. జార్ఖండ్‌లో నిరుద్యోగ సమస్య యువతను పట్టిపీడిస్తున్నదన్నారు. ఇక్కడి యువతకు అపారమైన ప్రతిభ ఉన్నదని, కానీ.. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు.

బీజేపీ జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే ఏకంగా 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను యువతకు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన ఎంతోమంది క్రీడాకారులు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్నారని, వారిలో సామర్థ్యాలు, నైపుణ్యాల ను మెరుగుపరిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారని అభిప్రాయపడ్డారు.

పండుగల సమయంలో జార్ఖండ్‌లో పలుచోట్ల రాళ్ల దాడులు జరిగాయని, సర్కార్ కర్ఫ్యూ సైతం విధించిందని ధ్వజమెత్తారు. జార్ఖండ్‌లో ఈ నెల 13. 20వ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు ఇదే నెల 23న విడుదల కానున్నాయి.