- సెయింట్ మార్టిన్ ద్వీపం ఇవ్వనందుకు కుట్ర
- చివరి ప్రసంగంలో చెప్పాలనుకొన్న హసీనా
- సందేశం ఇవ్వకుండానే దేశం విడిచి పరార్
- ఆ సందేశంలో అమెరికాపై తీవ్ర ఆరోపణలు
- బంగ్లాదేశ్ కొత్త సీజేగా సయ్యద్ రెఫాద్
- హింసతో మరింత మంది అధికారుల రాజీనామాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 11: బంగ్లా సంక్షోభానికి అమెరికానే కారణమని భారత్‌లో తలదాచుకొన్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. ఈ నెల 5న నిరసనకారులు ఆమె అధికార నివాసాన్ని చుట్టుముట్టినప్పుడు జాతినుద్దేశించి ప్రసంగించాలని ఆమె ఓ సందేశాన్ని సిద్ధం చేసుకొ న్నారు. ఆ సందేశం ఇవ్వకుండానే దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ ప్రసంగం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందులో అమెరికాపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
నా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర
అమెరికా డిమాండ్లకు తలొగ్గకపోవటంతో తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అగ్రరాజ్యం కుట్ర చేసిందని హసీనా ఆ ప్రసంగంలో ఆరోపించారు. ‘దేశంలో మృతదేహాల ఊరేగింపులను చూడలేకనే ప్రధాని పద వికి రాజీనామా చేశా. విద్యార్థుల మృతదేహాలపై అధికారంలోకి రావాలని వాళ్లు (ప్రతిప క్షాలు) కోరుకొంటున్నారు. కానీ, దానిని నేను జరుగనివ్వను. నేను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నాను. బంగాళాఖాతం, సెయిం ట్ మార్టిన్ ద్వీపంపై అమెరికాకు సార్వభౌమత్వాన్ని అప్పగించి నేను అధికారంలో కొనసా గాలని అనుకోవటంలేదు.
నా దేశ ప్రజలారా? మిమ్మల్ని ఒకటే వేడుకొంటున్నాను. అతివాదుల మాటలు విని మోసపోవద్దు. నేను ఇంకా దేశంలోనే ఉంటే మరింత మంది ప్రాణాలు పోతాయి. అందుకే వైదొలుగుతున్నా. మీరే నా బలం. మీరు కోరుకొన్నారు కాబట్టే నేను మీ నాయకురాలిని అయ్యాను. వద్దంటే వెళ్లిపోతున్నా. కానీ మళ్లీ మాతృదేశానికి తిరిగి వస్తా. అవామీ లీగ్ మళ్లీ మళ్లీ బలం పుంజుకొంటూనే ఉంటుంది’ అని ఆ ప్రసంగంలో హసీనా రాసుకొన్నారు. రజాకార్ అన్న ఆరోపణలపైన.. ‘నేను మిమ్మల్ని రజాకార్ అనలేదు. నా మాటలను వక్రీకరించారు. ఒకసారి నేను మాట్లాడిన వీడియో అంతా చూడండి’ అని రాశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమం చేస్తున్న సమయ ంలో ఆందోళనకారులను రజాకార్లతో పోల్చారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
కొత్త సీజేగా సయ్యద్ రెఫాద్
విద్యార్థుల అల్టిమేటంతో బంగ్లాదేశ్ సుప్రీంప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఒబైదుల్లా హస్సన్ రాజీనామా చేయటంతో జస్టిస్ యసెద్ రెఫాత్ అహ్మెద్ కొత్త సీజేగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. దేశ 25 ప్రధాన న్యాయమూర్తిగా నియమి తులయ్యారు.
ఆగని అల్లర్లు
బంగ్లాదేశ్‌లో అల్లర్లు ఇంకా ఆగటంలేదు. తాజాగా నిరసనకారులు మైనారి టీలతోపాటు అవామీలీగ్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన ప్రభుత్వ అధికా రులపై పడ్డారు. ఆఫీసుల్లోకి దూసుకుపోయి అధికారులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. మైనారిటీలపై దాడులు సరేసరి. మతఛాం దసవాదుల దాడులను నిరసిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం హిందువులు, ఇతర మైనారిటీలు భారీ ర్యాలీలు నిర్వహించారు. దాడులు ఆపాలని తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ పిలుపునిచ్చినా పట్టించుకోవటంలేదు. ‘కొన్ని చర్యలవల్ల మీ పోరాటమంతా వృథా అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో విఫ లం కావొద్దు. వారు మనదేశ పౌరులు కారా? వారి కుటుంబాలను రక్షించలేరా? వాళ్లు మన సోదరులు. మన మంతా కలిసి పోరాడాలి. కలిసి ఉండాలి’ అని శనివారం ఆయన రంగ్‌పూర్ పర్యటనలో పిలుపునిచ్చారు. కానీ, ఉద్యమకారుల్లో కొన్ని వర్గాలు ఆయన మాటలను పట్టించుకోలేదు.