calender_icon.png 5 November, 2024 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరు సిగలో మణిహారం

22-07-2024 02:49:50 AM

త్వరలోనే 250 అడుగుల ఎత్తున ఆకాశ స్తంభం నిర్మాణం 

25 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

బెంగళూరు, జూలై 21 : సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు సిగలో మరో మణిహారం చేరనుంది. బెంగళూరు నైస్ రోడ్డులోని హెమ్మిగెపురలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా స్కైడెక్ గోపురం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 25 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రదేశంలో 250 అడుగుల ఎత్తున గోపురాన్ని నిర్మిస్తారు.            ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో హెమ్మిగెపుర గోపుర నిర్మాణంపై చర్చించారు. అనంతరం తీర్మానం చేశారు. ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా విస్తరించాలని నిర్ణయించారు. హెమ్మిగెపుర చుట్టుపక్కల తురహళ్లి అటవీ ప్రదేశం, సోమపుర విహార కేంద్రాలు, తలఘట్టపుర మెట్రో స్టేషన్ ఉండటంతో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.