calender_icon.png 24 March, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరు శుభారంభం

23-03-2025 12:59:07 AM

ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (56) అర్థసెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్ (44) ఆకట్టుకున్నాడు.

ఆఖర్లో అంగ్‌క్రిష్ రఘువంశీ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.2  ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (59 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించగా.. ఫిల్ సాల్ట్ (56) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.

కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. నేడు జరగనున్న డబుల్ హెడర్‌లో భాగంగా  ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం జరగనున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్, రాత్రి చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.