calender_icon.png 25 September, 2024 | 9:58 AM

బెంగళూరులో తొలి హైస్పీడ్ రైలు తయారీ

21-09-2024 02:27:40 AM

బెంగళూరు, సెప్టెంబర్ 20: భారత తొలి హైస్పీడ్ రైలు తయారీకి బెంగళూరు వేదిక కానుంది. ఇప్పటికే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ 5వ తేదీన హైస్పీడ్ చైర్‌కార్ ట్రెయిన్ తయారీకి సంబంధించిన టెండర్‌ను విడుదల చేసింది. బిడ్ల దాఖలుకు సెప్టెబర్ 19తో గడువు కూడా ముగియ గా.. బీఈఎంఎల్ మాత్రమే కొటేషన్ వేసింది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యంతో వీటిని నిర్మిస్తున్నారు. ముంబై  అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మార్గంలో సిద్ధమైన హైస్పీడ్ కారిడార్‌లో ఈ రైలును వినియోగించను న్నారు. ఈ కారిడార్‌ను రూ.1.1 లక్షల కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు రైలు అసలు ధరను బహిర్గతం చేయలేదు. దాదాపు రూ.200 కోట్ల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు.