ధోతీలో రైతును లోనికి రానివ్వని మాల్
బెంగళూరు, జూలై 18: బెంగళూరులోని మగాడి రోడ్డులో ఉన్న జీటీ మాల్.. వ్రస్త్రధారణ కారణంగా ఓ రైతును లోనికి రానివ్వకపో వడంతో రైతులంతా కలిసి మాల్ ఎ దుట నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో.. మాల్ యాజమాన్యంపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తగా.. మాల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని రా్రష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు బృహత్ బెంగుళూరు మహానగర పాలక సంస్థ జీటీమాల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. మాల్‌ను ఏడు రోజుల పాటు మూసివేయడంతో పాటు యాజమాన్యం సదరు రైతుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.