హైదరాబాద్: పీకేఎల్ 11వ సీజన్‌లో బెంగళూరు బుల్స్ బోణీ కొట్టిం ది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 34-33 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన బెంగళూరు రైడర్ జై భగవాన్ సూపర్ టెన్‌తో సత్తా చాటాడు. బెంగా ల్ వారియర్జ్-పునేరి పల్టన్ మధ్య జరిగిన మ్యాచ్ 32-32 తో డ్రాగా ముగి సింది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో గుజరాత్‌తో తమిళ్ తలైవాస్, యూపీ యోద్ధాస్‌తో హర్యానా అమీతుమీ తేల్చుకోనున్నాయి.