calender_icon.png 15 March, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కశ్మీర్‌లో బందూక్ గర్జన

07-07-2024 01:59:12 AM

ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతం

పోరాటంలో ఇద్దరు సైనికులు వీరమరణం  

కుల్గాం, జూలై 6: జమ్ముకశ్మీర్‌లో మరోసారి తుపాకులు గర్జించాయి. కుల్గాం జిల్లాలో శనివారం చోటుచేసుకొన్న వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులను ఏరివేసే క్రమంలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ మొదలుపెట్టిన భద్రతా బలగాలకు మోదెర్‌గావ్ గ్రామంలో ఉగ్రవాదులు తారసపడ్డారు. ఓ ఇంట్లో నక్కి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాలుల్లో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడి అనంతరం మరణించారు. ఇదే జిల్లాలోని ఫ్రిసల్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకొన్నది. ఇక్కడ నలుగురు ముష్కరులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు వీరమరణం పొందాడు.