కరీంనగర్,(విజయక్రాంతి): జిల్లాలో ఈనెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ అఖిల్ మహజన్ తెలియజేశారు. అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ, జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. గ్రూప్-III సర్వీసెస్ పరీక్షల కోసం జిల్లాలో 34 పరీక్షా కేంద్రాలు నామినేట్ చేయబడ్డాయి. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో(20) జగిత్యాల రూరల్ పరిధిలో(03) మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో(01) కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో(02) కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో (08) ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల టౌన్ పీఎస్ జగిత్యాల రూరల్ పీఎస్ మల్యాల పీఎస్ కొడిమ్యాల పీఎస్ కోరుట్ల టౌన్ పీఎస్ లలో పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేయడం జరుగుతుంది.
కావున పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడ గుమికుడి ఉండవద్దు. జిరాక్స్ సెంటర్,ఇతర దుకాణాలు మూసి ఉంచాలి. ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి ఆస్కారం లేకుండా, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది అని ఎస్పీ తెలిపినారు. మొత్తం జిల్లాలో (220) మంది పోలీస్ అధికారులతో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో(7) సిఐ అదికారులు, (37) మంది ఎస్‌ఐ అధికారులు, (67) మంది ఏఎస్‌ఐ/హెచ్‌సి అధికారులు, (76) మంది పోలీస్ కానిస్టేబుల్ అధికారులు (34) హోం గార్డ్ అధికారులు ఇట్టి బందోబస్త్ లో పాల్గొంటారు అని ఎస్పీ గారు తెలిపినారు. గ్రూప్-III సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన నియమ, నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని, పరీక్ష కేంద్రాలకు చేరుకొనే సమయంలో అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే ఆయా పరిధిలోని పోలీస్ అధికారులకు గాని, డయల్ 100 కు గాని సంప్రదించాలని ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది.