- బాలికతో వెట్టి చేయించి, దొంగతనం చేసిందని నెపం
- పోలీసులతో చిత్రహింసలు.. ఆత్మహత్య చేసుకున్న బాలిక?
- విజయక్రాంతిలో వరుస కథనాలు
గద్వాల(వనపర్తి), నవంబర్ 11 (విజయక్రాంతి): బాలిక ఆత్మహత్యకు కారణమైన సీడ్ వ్యాపారి బండ్ల రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు సోమవార అరెస్టు చేశారు. బాలికతో వెట్టి చేయించుకుని దొంగతనం నెపంతో పోలీసుల చేత చిత్రహింసలకు గురి చేయడంతో మనస్థాపం చెందిన బాలిక ఆత్మహ త్యాయత్నానికి ఒడిగట్టి దాదాపు 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడి గత నెల 24న మృతి చెందింది.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన సీడ్ వ్యాపారి బండ్ల రాజశేఖర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీనిపై విజయ క్రాంతి వరుస కథనాలను ప్రచురించడంతో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఆయా పార్టీల నాయకులు భాధిత కుటుంబానికి అండగా నిలిచారు. నిందితుడిని శిక్షించాలని నిరసనలు చేశారు.
అరెస్ట్ తప్పదని ముందే గ్రహించిన రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో ముం దస్తు బెయిల్ ఫిటిషన్ వేయగా అది తిరస్కరణకు గురయినట్లు తెలిసింది. అరెస్ట్ తప్పదని గ్రహించి తానే పోలీసుల ముందు లొం గిపోయినట్లుగా ప్రచారం జరుగుతున్నది.
కానీ పోలీస్ వర్గాలు మాత్రం నింది తుడు పరారీలో ఉండటంతో ప్రత్యేక బృం దాలతో గాలించి కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ జిల్లాలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడ కు వెళ్లి అరెస్ట్ చేసినట్లు మీడియాకు తెలిపారు. సోమవారం గద్వాల కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు 11 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.
పోలీసులపై చర్యలేవీ?
వెట్టి చాకిరీ చేయించుకుని దొంగతనం నింద వేయడంతో నిబంధనలకు విరుద్ధంగా బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేసిన పోలీసులపై నేటికీ చర్రయలు తీసుకోకపోవడంతో ప్రజల నుంచి పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలికను వెట్టి చాకిరీ చేయించుకున్న వ్యాపారిని వదిలివేసి బాలికను అవమానకరంగా స్టేషన్‌లో విచారణ చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడంతోనే ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. దీంతో పాటు బాధిత కుటుంబంపై రెడ్డి కులం అనే అహకారంతో రౌడీయిజాన్ని ప్రదర్శించిన మరికొందరి వ్యక్తులపైనా చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది.