calender_icon.png 27 January, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణపేట జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బండి శివరాంరెడ్డి

26-01-2025 01:34:11 AM

ప్రధాన కార్యదర్శిగా సత్య రఘుపాల్‌రెడ్డి 

నారాయణపేట, జనవరి 26 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మున్నూరు కాపు సంఘం తొలి అధ్యక్షుడిగా నారాయణపేట పట్టణానికి చెందిన బండి శివరాం రెడ్డిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా సత్య రఘు పాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శనివారం నారాయణపేట సమీపంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్ మాజీ ఎమ్మెల్యే అహుజా పాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని అందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

నారాయణపేటలో మున్నూరు కాపు సంఘం కళ్యాణమండపం నిర్మాణానికి  రాయచూర్ మున్నూరు కాపు సంఘం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా మున్నూరు కాపు సోదరులు, సోదరీమణులు రాజకీయం గా ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. మున్నూరు కాపు సంఘం నాయకులు యంకి హనుమంత్ రెడ్డి, సుతారి వెంకట్ రామ్ రెడ్డి, శ్యాశం రామకృష్ణ, మల్ రెడ్డి, జొన్నల సుభాష్, కాంకుర్తి భీం రెడ్డి, బసి రెడ్డి, సూర్య ప్రకాష్ రెడ్డి, ఎల్కోటి నారాయణ రెడ్డి,హనుమంత్ రెడ్డి, కోసిగి ప్రతాప్ రెడ్డి లు పాల్గొన్నారు.