calender_icon.png 10 January, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి శివుడు మమ్మల్ని బతకనివ్వడు

04-07-2024 02:48:09 AM

  • నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఎదుట చెంచుల గోడు 
  • ఇక నుంచి ఆదార్‌తోపాటు అన్ని సంక్షేమ ఫలాలు 
  • చెంచులకు భరోసానిచ్చిన కలెక్టర్ సంతోష్

నాగర్‌కర్నూల్, జూలై 3(విజయక్రాంతి): మొలచింతలపల్లి ఘటనలో సాక్షులుగా ఉన్న మరికొందరి చెంచులను, వారికి అనుకూలంగా నోరువిప్పిన వారిని ప్రధాన నిందితుడి తమ్ముడు బండి శివుడు చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని.. తామంతా గ్రామం లో స్వేచ్ఛ గా తిరగలేకపోతున్నామంటూ చెంచులు కలెక్టర్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బుధవారం కలెక్టర్ బదావత్ సంతోష్ కొల్లాపూర్ నియోజకవర్గంలోని మొలచింతలపల్లి చెంచుకాలనీలో పర్యటించారు. అత్యంత పాశవిక దాడికి గురైన ఈశ్వరమ్మను పరామర్శించారు. వారికి ఆరోగ్యం, ఆహారం, వసతి అంశాలను అడిగి తెలుసుకున్నారు.

నిందితుడి తమ్ముడు బండి శివుడు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. తమకు ఉపాధి అవ కాశాలను కల్పించాలని వేడుకున్నారు. ఆధార్ కార్డుల కోసం గ్రామంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములను సాగు చేసుకునేందుకు భూమిని తిరిగి ఇప్పిస్తాని చెప్పారు. ఇరవై ఏళ్ల క్రితం చెంచులకోసం ప్రభుత్వం 23ఎకరాలను కొనుగోలు చేసిందని.. కానీ, ఇంకా ఎనిమిది ఎకరాలు వారి పేరునే ఉందని బాధిత రైతులు  కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే ఆసమస్యను పరిష్కరించాలని ఆర్డీవోను ఆదే శించారు. ఇకపై ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.