calender_icon.png 25 October, 2024 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అధినాయకురాలి అల్లుడి కోసమే కదా..? ఇదంతా..!

25-10-2024 01:16:14 PM

హైదరాబాద్: మూసీ నది కాలుష్యానికి 40 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమని కేంద్రమంది బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహా ధర్నా చేస్తోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. మూసీ నది కాలుష్యానికి కారకులు ఎవరు?.. అని బండి సంజయ్ ప్రశ్నించారు. మూసీ నది కాలుష్యానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమని తెలిపారు. మూసీ పునరుజ్జీవనం పేరుతో రేవంత్ రెడ్డి అనే మాటలు మార్చారని చెప్పారు. కాంగ్రెస్ అధినాయకురాలి అల్లుడి కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ అధినాయకురాలి అల్లుడు వచ్చి కాంట్రాక్టర్లతో మాట్టాడి వెళ్లారని ఆరోపించారు. మూసీకి రూ. లక్షన్నర కోట్లు రేవంత్ రెడ్డి ఎక్కణ్నుంచి తెస్తారో చెప్పాలి..?, మూసీ బాగు కోసం ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తెస్తారా..? అని ప్రశ్నించారు. రూ. లక్షన్నర కోట్లతో మీరు ఇచ్చిన అనేక హామీలు తీర్చవచ్చని సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల ప్రస్తావన లేదని మండిపడ్డారు. రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి  మరల్చేందుకు హైడ్రా అన్నారు. హైడ్రాపై ప్రజలు తిరగబడ్డారు.. ఇప్పడు మూసీ ప్రక్షాళన అంటున్నారని ఫైర్ అయ్యారు. సబర్మతి నది ప్రక్షాళన కోసం రూ. 7 వేల కోట్లే ఖర్చు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి పేదలు అనేక బాధలు పడుతున్నారని చెప్పారు. మూసీలోని ఇళ్లకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు.