calender_icon.png 1 February, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి

29-01-2025 01:26:21 AM

ఎల్బీనగర్, జనవరి 28 : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రజా యుద్ధనౌక గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆదేశాలతో ఎల్బీనగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శివ కుమార్ ఆందోళన చేపట్టారు.

హస్తినాపురం డివిజన్ లో ఇందిరాగాంధీ, గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు దెంది శ్రీధర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ కోఆర్డినేటర్ విద్యా రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి నికేష్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు సాయిరాం రెడ్డి, సామలేటి సాయి, ప్రధాన కార్యదర్శులు దాడి రుత్విక్ రెడ్డి, మన్నె రాము యాదవ్, దాసు మనోజ్,  దుర్గేశ్, డివిజన్ల అధ్యక్షులు రమణా రెడ్డి, శ్రీనివాస్, మధు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మ రెడ్డి, మధు, బ్రహ్మ చారి, యువజన  నాయకులు పగిడిమర్రి భార్గవ్, రాము గౌడ్, సాయి కృష్ణ, రాజు, కొమ్ము శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.